Tuesday, July 5, 2016

At That Point Where You Want To DO


At That Point Where You Want To DO Something, Even If You Don’t Have Financial Compulsions?


Most of us moms reach this stage and Mitali is one such mom who made the most of it!! Having been a career women pre-motherhood with an engineering and MBA degree, when Mitali’s kids were in full day school, she knew it was time she did something for her interest; she wanted to deploy her time into something lucrative.
After having taught her kids phonics, way before it was such a hot concept in India, she started with a phonics class and was an instant hit. But something prompted her to continue her search for something closer to her field of expertise.
IMG-20160622-WA0000
That’s when she came across the i-Maths program which absolutely thrilled her. Mitali was enamored by the concept. The basic funda of teaching kids mathematical concepts through activities is what fascinated her. She instantly knew that several kids would benefit from this program in many ways since it is an international concept of teaching Maths that is very different from the method that is adopted in most schools here.
i-Maths basically focuses on the development of the right and left brain by teaching Maths through activities and specialized apparatus. It is an application-oriented program where all the concepts are simplified and taught in a unique way, which results in thorough learning and retention of the concept. It also aims at improving the child’s observation and thinking ability. The equipment that is used is colourful and attractive to keep the child engaged. This results in activation of both sides of the brain, which results in improving the child’s grasping as well as retention, which helps in their overall development.
IMG-20160621-WA0019
Mitali, took up the i-Maths franchise at Andheri West in Mumbai with a lot of enthusiasm, knowing that it would appeal to her crowd of people. She started with 2 kids in her class and within a period of 3 years has a student strength of 100 kids. Her belief in the program motivated her to put in her best into everything. Besides using the company’s equipment, which she swears by, she kept using innovative method and fun props to make her classes interesting. For example, ‘Coordinates and Graphs’ are taught in her class using fictional cartoons and characters that all stay together in an apartment complex!!
IMG-20160621-WA0020
Basic concepts like ‘addition’ is taught using colourful abacus stands which the company provides and ensures that each child has their own. The number of children are limited to 10 per class to ensure quality and attention. A lot of attention is paid to generalized concepts like ‘Basic Networks’. They device games to explain these concepts which results in a permanent imprint on the child’s brain.
IMG-20160622-WA0006

The Social Media Advantage

Mitali realized that the best way to reach out to her crowd and give them confidence is through social media. She made the most of it by developing a very lively and colourful FB page where she keeps the parent involved by putting up pictures of all her classes so that the parents know what is being taught in class and can revise the concepts with their children. She also puts up videos of the concepts taught to keep parents on the same page.
The effective use of FB and whatsapp has been her key to success since she knew her audience would appreciate it. The colourful equipment used in class also is a great help in making the page exciting and engaging. She left no stone unturned to reach out!!
So many of us are in similar situations at some stage of our life post motherhood, where we are looking for something to do that gives us satisfaction and helps to put our time to creative use. The long hiatus of not having done anything to nurture our interests makes us apprehensive. That’s when we have to make space for ourselves and find something to do which gives us contentment without taking too much away from our family responsibilities. Stories like that of Mitali’s gives us inspiration!!

Thursday, June 19, 2014

Birthday Alerts

                        
To remember our beloved friends and family member's birthdays here it is a site. This alerts by giving mail on birthday's of beloved ones


http://www.birthdayalarm.com/



Registration is simple enter your mail id and import contacts of that id and send the request to your beloved ones that all you will get your birthday calender

Monday, October 7, 2013

యువత పొదుపు మంత్రం..


ఉన్నత విద్యను చదవడానికి నగరానికి వచ్చిన యువత ఆర్థిక మాంద్యం కమ్ముకున్న ఈ సమయంలో కాలేజీ ఖర్చులకు తల్లిదండ్రులు పంపిన డబ్బుల్ని దుబారాగా ఖర్చు పెట్టకుండా పొదుపు మంత్రం పాటించాలనుకుంటున్నారు. పేరెంట్స్‌కి కష్టం కలిగించకూడదని జల్సాల్ని వదిలి ఖాళీ సమయాల్లో సంపాదన మార్గాల్ని అన్వేషించేవారు పెరిగిపోతున్నారు.ఎలా సంపాదించాలి, పొదుపు చేయాలి అనే విషయం ఆలోచిస్తు న్నారు. ఇలాంటి వాటి గురించి యువత బెంగ పెట్టుకోవ సరం లేదని, పొదపుకు అనేక మార్గాలున్నాయంటున్నారు అనుభవజ్ఞులు.

youthఉన్నత విద్యను చదివేందుకు నగరాలకు వచ్చి పలువురు యువతీయువకులు స్వేచ్ఛా వాతావరణంలో ఉంటున్నారు. వారిలో ఎక్కువ శాతం మధ్య తరగ తికి చెందినవారే ఉన్నారు. నగరాలలో ఉండి చదువుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా అవసరం అవుతుంది. ఇంటి దగ్గరనుంచి తెచ్చుకున్నవి సరిపోవు. ఇం ట్లో వాళ్ళకు చెబుదామంటే వాళ్ళ ఆర్థిక పరిిస్థితి చూసి అడగడానికి మనసు రాదు. కాని పెద్ద చదువులు చదవాలన్న తపనతో ఎంత దూరంగా ఉన్న కాలేేజీలోనైనా చదవడానికి వెళుతుంటారు యువత.

అలాంటప్పుడు వారు ఖర్చులకు డబ్బులు ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేయాలి అనే విషయాల ను ఆలోచిస్తుంటారు. ఆందోళన పడుతుంటారు. ఇలాంటి వాటికి చాలా మార్గాలు న్నాయి... బెంగ అవసరంలేదని అంటున్నారు అనుభవజ్ఞులు. ఇలాంటి విషయాల గురిరచి విద్యార్థులను, తల్లిదండ్రులను, ఆర్ధికనిపుణులను అడిగినప్పు డు వారు చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...

అద్దెను పంచుకుంటాం :
శ్రీయా పంకజ్‌ నాలుగేళ్ళ క్రితం చిత్తూరు నుంచి హైదరాబాద్‌కి బీబీఏ చదవడానికి వచ్చింది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు పంపించే డబ్బులు ఆమె అవసరాలకు ఈ పెద్ద నగరంలో ఏ మాత్రం సరిపోవు. ఇంటి దగ్గర నుంచి పంపిం చే డబ్బులతో అద్దె, తిండి, ఇతర ఖర్చులకు సర్దుకోవాలంటే చాలా కష్టం. ‘అందు వల్ల నేను ఆర్థిక నిపుణుల సలహాననుసరించి చిన్న ఉద్యోగం చేస్తున్నాను.ఇప్పుడు నా ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తగ్గాయి. మా తల్లిదండ్రులు నన్ను కాలేజీ హాస్ట ల్లో ఉండమన్నారు. హాస్టల్‌కి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, స్నేహితుల తో కలిసి నేను ఒక ఫ్లాట్లో ఉంటున్నాను. ఫ్లాట్‌ అద్దెను మేమందరం పంచుకుం టాం. దాంతో మా డబ్బు చాలావరకు ఆదా అవుతోంది’ అని ఆమె పేర్కొంది.

కలిసుంటే లాభాలు :
‘స్నేహితులందరూ కలిసుండడం వల్ల చాలా లాభాలున్నాయి. స్టడీ టేబుల్‌, కుర్చీలు, వంటసామాగ్రి మొదలైనవి వేరు వేరుగా కాకుండా అందరూ కలిసి కొనుక్కోవడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది’ అని ఉన్నత విద్య ను అభ్యసిస్తోన్న నీ రజ్‌ పేర్కొన్నాడు.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది :
‘నేను చదువుకునే రోజుల్లో ఆర్థిక పరమైన ఇ బ్బందులను ఎదుర్కొనేందుకు నేను ఒక పార్ట్‌టైం జాబ్‌ చేసేవాణ్ణి. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు తొలగడమే కాకుండా యువతలో ఆత్మ విశ్వాసం కూడా పెరుగు తుంది. ఇప్పుడున్న యువతరం ఇలాంటి పార్ట్‌టైం జాబ్స్‌ చేయడానికి చాలా మంది సుముఖంగా ఉన్నారు’ అని ఓ జీవిత భీమాసంస్థ ఏజెంట్‌ అడెయైజర్‌ తులిప్‌ కుమార్‌ పేర్కొన్నారు.

‘నేను ట్యూషన్స్‌ చెప్పడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోగలిగాను’ అని విజయనగరం నుంచి పీజీ చేయడం కోసం నగరానికి వచ్చిన సుప్రియ తెలిపింది. చాలా దూరం పోయి చదువుకుంటే మా ఇంట్లో వాళ్ళు నాకు చాలీచాలని డబ్బులు పంపిస్తున్నారు అనుకోకుండా పైన చెప్పిన విధానాన్ని పాటించి మీ ఇంట్లో వాళ్లని ఇబ్బంది పెట్టకుండా చదువుకోడానికి యువతీయువకులు ప్రయత్నించవచ్చు. తద్వారా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకొని రాబోయే తరానికి ఆదర్శంగా నిలవండి.

తెలుగు బ్లాగులపై “ఈనాడు” ఆదివారం లో ప్రత్యేక కథనం

తెలుగు బ్లాగుల పై మెయిన్ స్ట్రీం మీడియా ఈ మధ్య బాగానే దృష్టి పెడుతోంది. ఇవ్వాళ ఈనాడు ఆదివారం అనుబంధం ముఖచిత్ర కథనం…కింద చదవండి
ఈనాడు కవర్ పేజీకి ఎక్కినందుకు మిత్రుడు శోధన సుధాకర్ కు ప్రత్యేక అభినందనలు…
బి అంటే బ్లాగు
ఈ-కాలం చిత్రమైంది సుమీ! ఎంతలో ఎంత మార్పు? మొన్నటిదాకా మెయిల్‌ ఐడీ సృష్టించుకోవడమే గొప్ప. నిన్నంతా వెబ్‌సైట్‌ జపం. ఇవ్వాళ, ‘హేయ్‌ నీ బ్లాగ్‌ అడ్రస్‌ ఏంటి యార్‌?’ అని సంభాషణలు. ఇంటి అడ్రస్‌ తప్ప మరో చిరునామా తెలియనివాళ్లు వెర్రిముఖాలేసినా, ‘ఇప్పుడదో వెర్రి కాబోలు’ అని ‘చాదస్తపు’ మనుషులు నొసలు చిట్లించినా… ఆధునిక రచ్చబండగా వర్ధిల్లుతోంది బ్లాగు. ఉబుసుపోని కబుర్ల నుంచి వూహాలోకాన్ని ఆవిష్కరించే కలలదాకా అన్నీ అక్కడ ‘మాట్లాడుకోవచ్చు’, పదాలతో పోట్లాడుకోవచ్చు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికీ తుంటరితనాన్ని ప్రదర్శించుకోవడానికీ చెప్పుకోదగినవి చెప్పుకుని ఆనందాన్ని పెంచుకోవడానికీ చెప్పుకోలేనివి చెప్పుకుని దుఃఖాన్ని పంచుకోవడానికీ ఇదే వేదిక. ఒక్క మాటలో ఇది మీ పక్కవాళ్లను చదవడానికి అనుమతిచ్చే మీ ఆన్‌లైన్‌ డైరీ.

ఆమాటంటే ఒప్పుకోడుగానీ ఆనంద్‌ అందరిలాంటివాడే. ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. అభిమాన హీరో సినిమా వెుదటి రోజు, వెుదటి ఆట చూసేశాడు. టికెట్‌ బ్లాకులో కొన్నాడా? రెకమెండేషన్లతో సంపాదించాడా? అప్రస్తుతం. వెుత్తానికి చూశాడు. సినిమా ఏ కోశానా నచ్చలేదు. డబ్బు, శ్రమ, సమయం… మూడు నష్టపోయాడు. ‘మూడ్‌’ ఆఫ్‌ అయింది. మ్యాట్నీకి పొలోమంటూ వస్తున్న జనాన్ని చూసి, ‘ఈ సినిమా బాగాలేదు’ అని అరవాలనిపించింది. అరవలేముగా! మర్యాదస్థులం కదా. కానీ ‘బాగాలేదు’ అని చెప్పెయ్యాలి. లేదంటే కడుపు ఉబ్బు తగ్గదు. సీరియస్‌గా ఇంటర్‌నెట్‌ కెఫేకు వెళ్లాడు. అంతకంటే సీరియస్‌గా తన బ్లాగులో టైపు చేయడం వెుదలుపెట్టాడు. అక్షరాలు ఎగదన్నుకొచ్చినై. స్క్రీన్‌ప్లేలో లోపం ఏమిటో, నటన ఎంత చెత్తగా ఉందో… ఇంకో రహస్యం.. అది ఏ హాలీవుడ్‌ సినిమాకు కాపీయో కూడా రాసేశాడు. హేపీ!
ఇప్పుడు ఆనంద్‌ సమీక్షకు ‘వెయిట్‌’ ఉంది. ఆ సినిమా చూద్దామని ‘వెయిట్‌’ చేస్తున్నవాళ్లను ఆపగలిగాడు మరి. అతి కొద్దిమందినే కావొచ్చు, కానీ దాని ప్రభావం ఉండడం గొప్ప విషయం కదా! ఆ కిక్కే ఆనంద్‌ను ‘బ్లాగర్‌’గా కొనసాగేలా చేస్తోంది. ఐటీ పరిశోధన, సలహా సంస్థ ‘గార్ట్‌నర్‌’ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు పదికోట్ల బ్లాగుల్లో ఆనంద్‌ది ఒకటని వేరే చెప్పక్కర్లేదు కదా!
వ్యక్తిగత వెబ్‌సైట్‌
బ్లాగ్‌… పూర్తిగా చెప్పాలంటే వెబ్‌లాగ్‌ (weblog)… దీన్నే విడదీసి 1999లో పీటర్‌ మెర్హోల్జ్‌ అనే బ్లాగర్‌ చమత్కారంగా ‘వి బ్లాగ్‌’ అన్నాడు. శ్రీనివాస్‌లోంచి విరిచిన శ్రీను పలకడానికి చక్కగా ఉండి, జనావోదం పొందినట్టే బ్లాగు కూడా వాడుకలోకి వచ్చింది. నామవాచకంగానూ క్రియగానూ చలామణీ అవుతోంది. భాషంటే జనావోదమేగా! ఇక వెబ్‌సైట్‌ అన్నా వెబ్‌లాగ్‌ అన్నా దాదాపుగా ఒకటే. తేడా అల్లా వెుదటిది అచ్చువేసిన పుస్తకమైతే, రెండోది నోట్‌బుక్కు లాంటిది. ఆ నోట్సులో ఏమైనా రాసుకోవచ్చు.
సినిమా సమీక్ష, పుస్తక సమీక్ష, ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ మంత్రాలు, మీ మీద, మీ స్నేహితుల మీద, మీ బాసు మీద(జాగ్రత్త! వాళ్ల దృష్టిలో పడి, ఉద్యోగాలు ఊడిపోయిన కేసులున్నాయి), చెట్ల మీద, గట్ల మీద… మీ కుక్కకు ఏం పేరు పెట్టారు… ఎందుకు పెట్టారు… ఏమైనా రాయెుచ్చు. ఇంకా మీరు పేర్చుకున్న కవితలు ఏ సంపాదకుడికో పంపక్కర్లేదు, కాణీ ఖర్చు లేకుండా అచ్చువేసుకోవడమే. అయితే, చెప్పేవాడికి వినేవాడు లోకువ అనుకోకుండా… ఎదుటివారితో పంచుకుంటే విలువ పెరిగేవైతే మంచిది. అప్పుడే మీ బ్లాగు ‘హిట్‌’ అవుతుంది. మీకు పేరొస్తుంది.
ఎందుకీ ఆకర్షణ?
దేన్నీ తేల్చకుండా నసిగితే మెచ్చే రకం కాదు ఇప్పటితరం. ఏ వెుహమాటాలు ఉండవు కాబట్టి, ధైర్యంగా వాతపెట్టేలా రాసుకోవచ్చు. అది రాజకీయాభిప్రాయం కానీ మరేదైనా కానీ. ప్రధానస్రవంతి ప్రసారమాధ్యమాలకు లేని సౌలభ్యం ఇది. అందుకే బ్లాగుమంత్రం విశ్వవ్యాప్తమైంది. కళాశాల విద్యార్థుల నుంచి కార్పొరేట్‌ సీఈఓల దాకా బ్లాగులు సృష్టించుకునేలా చేస్తోంది. దర్శకుడు శేఖర్‌కపూర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ సాగరికా ఘోష్‌లాంటివారు నిత్య బ్లాగరులే. అమెరికా సామ్రాజ్యవాదం నుంచి నైజీరియా ఆకలిచావుల దాకా, బుద్ధుడి బోధనల నుంచి గ్లోబల్‌వార్మింగ్‌దాకా అన్నీ ఇందులో చర్చనీయాంశాలే. ‘స్త్టెల్‌షీట్‌ను ఫాలో కావాలి, పదాల లెక్కలు పాటించాలి అన్న సమస్యలేదు. కావాల్సినంత స్వేచ్ఛగా రాసుకోవచ్చు’ అంటాడు ముంబయి జర్నలిస్టు అమిత్‌వర్మ. బ్లాగుల్లో మరో సానుకూలాంశం ఫీడ్‌బ్యాక్‌. మనం రాసిందానికి వెంటనే స్పందన వస్తుంది. నచ్చనీ నచ్చకపోనీ… కొందరు దాన్ని చదివారు, మనం ప్రస్తావించిన అంశం గురించి ఆలోచించారు అన్న తృప్తి మిగులుతుంది.
ఇది బ్లాగులు ఉన్నవారి విషయం. లేనివారి సంగతి?
పాల్గొనే అవకాశం
బ్లాగింగ్‌ చేయడమంటే రాయాలనే కాదు. అందరూ రాసుకుంటూ పోతే చదివేదెవరు? ట్రావెల్‌ బ్లాగ్‌, పొలిటికల్‌ బ్లాగ్‌, ఫ్యాషన్‌ బ్లాగ్‌, లీగల్‌ బ్లాగ్‌, కార్పొరేట్‌ బ్లాగ్‌, కన్ఫెషన్‌ బ్లాగ్‌, అడల్ట్‌ బ్లాగ్‌… ఎన్నో రకాలు. అంశాన్ని బట్టి బ్లాగులను ఎంపిక చేసుకోవడానికి టెక్నోరాటి, బ్లాగ్‌డిగ్గర్‌, ఫీడ్‌స్టెర్‌లాంటి సెర్చ్‌ ఇంజిన్స్‌ మనకు దోహదం చేస్తాయి.
చదివిన అంశాలమీద నిర్మొహమాటంగా మన అభిప్రాయం చెప్పొచ్చు. ఖండిస్తామా పొగుడుతామా మన ఇష్టం. మైస్పేస్‌, ఫేస్‌బుక్‌, టైప్‌ప్యాడ్‌, ఆర్కుట్‌, యూట్యూబ్‌, ఫ్లికర్‌, మమ్స్‌నెట్‌, కేర్‌2 లాంటి వెబ్‌సైట్లు ఆదరణ పొందడానికి కారణం నెటిజన్లు పాల్గొనే అవకాశం ఇవ్వడమే. అందుకే ఇంతకుముందు సాధారణ వెబ్‌సైట్లుగా ఉన్న రాయిటర్స్‌, బీబీసీ, గార్డియన్‌లాంటివీ బ్లాగింగ్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, సన్‌, ఇంటెల్‌ లాంటి సంస్థలు వినియోగదారుల స్పందన కోసం బ్లాగులను ఏర్పాటుచేసుకున్నాయి. వెబ్‌సైట్‌ నిర్మాణంతో పోల్చితే దీనికయ్యే ఖర్చు చాలా తక్కువ కావడం మరో లాభం. ఇంకో అమూల్యమైన ప్రయోజనం ఉందని గుర్తుచేస్తాడు, రోజుకు అరగంటైనా బ్లాగు చెయ్యకుండా నిద్రపోని ఎంసీఏ పవన్‌… ‘కాగితం అక్కర్లేని సమాచార ప్రపంచం. చెట్లను కొట్టాల్సిన పనిలేని భావప్రసారం’.
కాసులు తెచ్చే కళ
ఎక్స్‌ప్రెస్‌ యువర్‌సెల్ఫ్‌… అంటుంది ఓ సెల్‌ఫోన్‌ ప్రకటన. బ్లాగు కూడా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోవడమే. ఇదే మిమ్మల్ని సెలబ్రిటీ చేయెుచ్చు. మీకు కాసులు కురిపించొచ్చు. కొన్నాళ్ల క్రితం అమిత్‌ అగర్వాల్‌ ఓ బ్లాగు ప్రారంభించాడు. వెుబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్ల మీద ఆయన ఇస్తున్న సూచనలు ఎందరినో ఆకర్షించాయి. అతడి labnol.blogspot.com పాపులర్‌ అయింది. హిట్స్‌ పెరిగాయి. కంపెనీలు ఇందులో ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. ఇంకేం? అమిత్‌ హైదరాబాద్‌లో ఉద్యోగం మానేసి సొంతనగరం ఆగ్రా వెళ్లిపోయాడు. ప్రస్తుతం… బ్లాగింగ్‌ అతడి ఫుల్‌టైమ్‌ జాబ్‌. చెన్నైకి చెందిన గణేశ్‌ షేర్‌మార్కెట్‌ మీద సలహాలు, సూచనలతో వెుదలుపెట్టిన http://www.rupya.comలో బ్యాంకులు ప్రకటనలు ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా కొన్ని సంస్థలు పేరువోసిన బ్లాగర్లను కన్సల్టెంట్లుగా నియమించుకున్న ఉదాహరణలున్నాయి. దీనికి వాళ్ల పెట్టుబడి… కొంత సమయం. డబ్బు మాత్రం కాదు.
టీవీ ఛానళ్లు ఉచితంగా ప్రసారాలు చేస్తూ, వ్యాపార ప్రకటనలు రాబట్టినట్టే ఇక్కడ కూడా. ప్రజాదరణ పొందేట్టు చూసుకోవడమే మన ప్రతిభ. బ్లాగులద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పే బ్లాగులు కూడా ఉన్నాయి.
‘ఇంటర్‌నెట్‌ అండ్‌ వెుబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అంచనా ప్రకారం గతేడాది మనదేశంలో ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల పెట్టుబడి రూ.218 కోట్లు. 2012 నాటికి ఇది రూ.2,200 కోట్లకు పెరగనుంది. ఇంటర్నెట్‌ వాడకందార్ల సంఖ్య ప్రస్తుత 4 కోట్ల నుంచి 2008 నాటికి 10 కోట్లకు పెరుగుతుంది.
భావ కాలుష్యం
చెడుకున్నంత అయస్కాంత శక్తి మంచికి లేదు. ఏదోలా తమ బ్లాగు నలుగురి దృష్టిలో పడాలన్న ఆరాటం కొంతా, ఏ నియంత్రణా లేని సమాచార విప్లవ విశృంఖల స్వేచ్ఛ మరికొంతా… వెరసి బ్లాగుల్లో కాలుష్యం పెరుగుతోంది. వర్ణాహంకార రాతలు, మత వైరాన్ని ప్రోత్సహించే కూతలు, వ్యక్తిగత దూషణలు, దేశాలతో నిమిత్తం లేకుండా సెక్సుబొమ్మలు… పునఃపరిశీలన ఉండదు కాబట్టి అందులో ఇచ్చే సమాచారంలో వాస్తవమెంత అనేది ఎప్పుడూ సమస్యే. బ్లాగర్లు కాపీరైట్‌ హక్కులను ఉల్లంఘిస్తున్నారనీ సంయమనం ఎంతమాత్రం పాటించట్లేదనీ ఉన్న విమర్శలు లెక్కకు మిక్కిలి. రచయిత అండ్రూ కీన్‌ అయితే ‘కోట్లాది కోతులు, కోట్లాది టైప్‌రైటర్ల మీద చేస్తున్న విన్యాసం’గా బ్లాగింగును అభివర్ణించాడు. ఈ పిల్ల చేష్టలమీద ‘ద కల్ట్‌ ఆఫ్‌ అమెచ్యూర్‌’ అనే పుస్తకం కూడా రాశాడు.
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్నట్టు, వాళ్లు వెతుకుతున్న బ్లాగులను బట్టి ‘నేటిజన్ను’(నేటి నెటిజన్‌) అంచనా వేయాలి. కత్తిపీటతో కుత్తుక కోయెుచ్చు, కూరగాయలు తరిగి పిల్లలకు వంటచేసి పెట్టొచ్చు… ఎవరి విచక్షణ, సంస్కారం వారిది!
ఒకటి మాత్రం నిజం. ఉత్తరాలు పోస్టు చేయడం మరిచిపోయిన నేటితరాన్ని మళ్లీ ‘పోస్టింగు’ చేయిస్తోంది బ్లాగు. 2006లో టైమ్‌ పత్రిక మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ‘నువ్వు’(యు) ఎంపిక కావడానికి కారణం బ్లాగులే. వాటిల్లో చోటుచేసుకున్న అర్థవంతమైన చర్చలే, భూగోళాన్ని మరింత బాగా తీర్చిదిద్దుకోవడానికి స్ఫూర్తిదాయకమైన సూచనలే.
‘ఐ థింక్‌, దేర్‌ఫోర్‌ ఐ యామ్‌’ అంటాడు ఫ్రెంచ్‌ తత్వవేత్త రెనీ డెస్కార్టెస్‌.
ఈ సుప్రసిద్ధ తాత్విక భావనను కొద్దిగా మార్చి రాసుకుంటే… ఐ రైట్‌, దేర్‌ఫోర్‌ ఐ యామ్‌… ఇదే ఇప్పటి యువతకు పరిచయవాక్యం, బ్లాగుల వ్యాసానికి భరతవాక్యం.
వీర బ్లాగిణి
ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్నదిగా చైనా నటి గ్జు జింగ్లెయి బ్లాగు sina.com.cn/m/xujinglei గుర్తింపు పొందింది. గాయని మాత్రమేకాక దర్శకురాలి అవతారమూ ఎత్తిన గ్జు ‘మ్యూజింగ్స్‌’ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. పది కోట్లమంది పైగా ఆ బ్లాగును దర్శించారు. ‘చదువుతున్నారని తెలిసినకొద్దీ నాలో ఉత్సాహం పెరిగింది’ అంటుంది 33 ఏళ్ల గ్జు. ఎక్కువగా తన సినిమాల కబుర్లు రాస్తుంటుంది. ‘నా చిత్రాలను ప్రవోట్‌ చేసుకోవడానికి ఇది చక్కటి మార్గం’ అని చెబుతుంది. మరోవైపు ‘గార్ట్‌నర్‌’ లెక్కల ప్రకారం కనీసం 20 కోట్లమంది తమ బ్లాగుల్లో పోస్టింగులు నిలిపేశారు. ఎవరూ చదవలేదేవో!
తెలుగు బ్లాగోగులు
ఆన్‌లైన్‌ విజ్ఞానసర్వస్వం వికీపీడియా విస్తరిస్తున్నట్టుగానే బ్లాగులు కూడా తెలుగునాట వర్ధిల్లుతున్నాయి. ఇంటర్‌నెట్‌లో మన మాతృభాషకు పట్టం కట్టేందుకు నడుంబిగించిన బ్లాగర్లున్నారు. వేమన పద్యాల సరళత్వం నుంచి చండీదాస్‌ సాహిత్య సంక్లిష్టత దాకా, రాజశేఖర్‌రెడ్డి ‘కడగడం’ నుంచి ప్రతిభాపాటిల్‌ ‘గెలవడం’ దాకా ఏదైనా ఇక్కడ చర్చనీయాంశమే. సోది, జల్లెడ, ఓరెమున, శ్రీకృష్ణదేవరాయలు, జ్యోతి, కొత్తపాళి, కల్హార, కలగూరగంప, గుండెచప్పుడు… ఎన్నెన్నో బ్లాగులు. 2006 సంవత్సరానికిగానూ ఇండీబ్లాగీస్‌ పేరిట ఇస్తున్న ఉత్తమ బ్లాగు అవార్డును తెలుగులో శోధన(sodhana.blogspot.com) గెలుచుకుంది. lekhini.org ఇంగ్లిష్‌ అక్షరాలను తెలుగు చేయడానికి సాయపడుతోంది.
బ్లాగు చేయరా డింభకా
మీకు తెలుసా? ఇప్పటికే తమ బ్లాగుల అనుభవాలతో కొంతమంది పుస్తకాలే రాసేశారు. అలాంటి వాటిల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసేందుకు 2005 నుంచి ‘ద లులు బ్లూకర్‌ ప్రైజ్‌’ కూడా ప్రారంభమైంది. ఇంత వ్యాప్తిలోకి వచ్చిన బ్లాగును ప్రారంభించుకోవడం చాలా సులువు. మూడు స్టెప్పుల్లో మీకో బ్లాగు సృష్టించి ఇచ్చే http://www.blogger.com, http://www.sulekha.com/blogs లాంటి ఉచిత వెబ్‌సైట్లున్నాయి. కూసింత నెట్‌ పరిజ్ఞానం ఉంటే చాలు. మెయిల్‌ ఐడీ లాగానే దీనికో అడ్రస్‌ ఎంచుకోవాలి. ఇక దీనికి మీరే విలేఖరి, మీరే సంపాదకులు.
చాలా బ్లాగుల్లో అక్షరాలకే(టెక్ట్సు) ప్రాధాన్యం. ఫొటోలు, వీడియోలు, ఎంపీ3 ప్లేయర్లు ప్రదర్శించడానికి కూడా ఆడియో, వీడియోబ్లాగులు అవకాశం కల్పిస్తున్నాయి.
బ్లిఘంటువు
ఎవరూ పుట్టించకపోతే పదాలెలా పుడతాయన్న మాయాబజార్‌లోని పింగళి డైలాగును గుర్తుతెచ్చుకుంటే… బ్లాగుల్లో కూడా అవసరార్థం కొత్త పదాలు వచ్చి చేరుతున్నాయి. అంతెందుకు? 2004లో మెరియమ్‌ వెబ్‌స్టర్‌ డిక్షనరీ ‘ఈ ఏడాది పదం’గా బ్లాగ్‌ను గుర్తించింది. ఆంగ్ల నిఘంటువుల్లో దొరకని, ‘బ్లాగోళ్ల’కు మాత్రమే తెలిసిన కొన్ని పదాలు ఇవీ:
బ్లెగ్‌: బెగ్‌ నుంచి పుట్టింది. సమాచారం అడుక్కోవడం.
బ్లాగోనీర్‌: పయోనీర్‌తో జత కలిసి వృద్ధి చెందింది. బ్లాగర్లలో ప్రసిద్ధుడన్నమాట.
బ్లాగోస్పైర్‌: వెుత్తం బ్లాగు ప్రపంచానికి సూచిక. స్పైర్‌ మాతృక. దీన్నే ‘బ్లాగావరణం’ అని చక్కగా తెలుగు చేశారు.
బ్లాగ్‌(blawg): బ్లాగ్‌+లా. చట్టసంబంధ విషయాలున్నది.
సెలెబ్లాగ్‌: సెలెబ్రిటీల కబుర్లతో నిండివున్నది.
ప్లాగ్‌: పొలిటికల్‌ బ్లాగ్‌
బ్లూక్‌: బ్లాగ్‌+బుక్‌. బ్లాగు సంబంధిత పుస్తకం.
బ్లూకర్‌: బుకర్‌ బహుమతినుంచి వచ్చింది.
బ్లాగ్‌హాపర్‌: బ్లాగుల మీద వాలేవాడు. గొల్లభామ అదే గ్రాస్‌హాపర్‌ దీనికి స్ఫూర్తి.
తస్మాత్‌ జాగ్రత్త
తన బ్లాగులో ప్రభుత్వ చర్యలను నిరసించినందుకుగానూ ఐక్యరాజ్యసమితి ప్రతినిధి జాన్‌ ప్రాంక్‌ను తమదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది సూడాన్‌.
* రెండేళ్ల క్రితం బ్లాగులో కార్పొరేట్‌ రహస్యాలు చర్చించినందుకుగానూ గూగుల్‌ ఉద్యోగి మార్క్‌ జెన్‌ పది రోజులపాటు సస్పెండ్‌ అయ్యాడు.
* బ్లాగు కారణంగానే గతేడాది ఫ్రెంచ్‌ మహిళ క్యాథెరీన్‌ శాండర్సన్‌ తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత న్యాయపోరాటంలో గెలిచిన ఆమె తన బ్లాగు జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తున్నట్టు ప్రకటించారు.
* ఇస్లాం గురించి ఈజిప్ట్‌ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ గురించి అభ్యంతరకరంగా రాశాడన్న కారణంగా కరీమ్‌ అమర్‌ అనే యువకుడికి నాలుగేళ్ల జైలుశిక్ష పడింది.
* విద్యా నాణ్యత బాగోలేదని రాసినందుకుగానూ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ తమ సీనియర్‌ లెక్చరర్‌ను బ్లాగు మూసెయ్యాలని ఆదేశించింది.
* తన శృంగార జీవితాన్ని బ్లాగుకెక్కించిన జెస్సికా కట్లర్‌ అనే అమెరికన్‌ ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ వ్యవహారాన్ని రచ్చ చేసినందుకుగానూ ఆమె ప్రియుడు పరువునష్టం దావా వేశాడు.

Wednesday, November 14, 2012


ఇంటింటికో ఆర్థిక రాజ్యాంగం

* మల్లెంపూటి ఆదినారాయణ

ఈ ప్రపంచంలో డబ్బుకంటే ఖరీదైనది ఏది ?
డబ్బును ఎలా సంపాదించాలో చెప్పే రహస్యం.
'అదెక్కడ దొరుకుతుందో చెప్పండి. ఎంత రేటుపెట్టి అయినా కొంటాం' అన్న మాట మీ గొంతులో నుంచి వస్తోంది కదూ..! కాస్త ఆగండి. ఆ కిటుకు మీ చేతుల్లోనే ఉంది. దాన్ని చేతల్లో చూపిస్తే మీరే భాగ్యవంతులు. విజయవంతమైన ఒక కంపెనీ ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తుందో.. మీరు కూడా అవే పద్ధతుల్ని పాటించడం ఆ రహస్యం. అందుకు మీకొక ఆర్థిక రాజ్యాంగం కావాలి. ఆర్థిక లక్ష్యం ఏర్పరుచుకోవాలి. ఏటా ఫ్యామిలీ బ్యాలెన్స్‌షీట్ ప్రకటించాలి. అప్పులతో ఆస్తుల్ని సంపాదించేందుకు డెట్(ఈ్ఛఛ్ట) మేనేజ్‌మెంట్‌ను అనుసరించాలి. సంక్షోభాల్లో తట్టుకునేందుకు ఎమర్జెన్సీ ఫండ్‌ను తయారుచేసుకోవాలి. అవన్నీ కలిపితే మీ ముందొక దివ్యమైన ఆర్థిక ప్రణాళిక ప్రత్యక్షమవుతుంది. ఇన్నాళ్లూ నష్టాల్లో.. కష్టాలు పడుతున్న మీ కుటుంబానికి బ్రేక్ ఈవెన్ వస్తుంది. అంటే మరేం లేదు. అప్పులు తీరిపోయి బతకడానికి సరిపోయే ఆర్థికధీమా సంపాదించుకోగలుగుతారు. అలాంటి ఆర్థిక ప్రణాళిక గురించే ఈ వారం కవర్‌స్టోరీ..


ఒకటో తారీఖు జీతం వొస్తుంది.
ఇంటి కిరాయి గుమ్మం దాటనివ్వదు.
స్కూలు ఫీజులు మారాం చేస్తాయి.
గ్యాస్ సిలిండర్ కళ్లలో నిప్పులు పోసుకుంటుంది.
కరెంటు బిల్లు షాక్ కొట్టినంత పని చేస్తుంది.
కేబుల్ బిల్లు ఏంటి సంగతని కన్నెగరేస్తుంది.
కిరాణా కొట్టువాడు వారం రోజుల్నించి తిండే లేనట్లు ముఖం మాడ్చేస్తుంటాడు.

అప్పటి వరకూ జోరుగా పరిగెత్తిన బైకు.. పెట్రోలు బంకు దగ్గరికి వచ్చేసరికి, 'దాహం.. దాహం' అంటూ మొండికేస్తుంది. పాలబిల్లు, వాటర్ బిల్లు, బ్యాంకు ఇన్‌స్టాల్‌మెంట్లు , ఎల్ఐసి.. ఒకర్నా ఇద్దర్నా! నెలొచ్చేసరికి అందరికీ ఎంతో కొంత పంచాలి. 'బాబ్బాబూ.. సర్దుకుపోండి. మళ్లీ వచ్చే నెల ఒకటో తారీఖు వరకు నన్ను బతికించుకోండి. మీ కోసం పుట్టినవాడ్ని' అని వేడుకోవాలి. అప్పటికి పరిస్థితులు 'పో.. బతుకుపో' అని దయతలిచి వదిలిపెడతాయి. మళ్లీ అదే జీతం. మళ్లీ అదే కష్టం. మళ్లీ అదే పంపిణీ కార్యక్రమం. నెలలు, సంవత్సరాలు ఖర్చవుతుంటాయి. ఒక రోజు మనకు మనం విలువ కట్టుకునేందుకు.. కాలంతో వయసును భాగిస్తే = అప్పులు సశేషం అని తేలుతుంది.
అందరి పరిస్థితీ ఇంతేనా? అంటే-
నూటికి ఎనభై శాతం.
మరి మిగిలిన ఇరవై శాతం మంది?
భాగ్యవంతులు.

ఈ ఇరవై శాతం మందిలో మిగిలిన వారికంటే నైపుణ్యాలు ఎక్కువ. అందుకు పొందుతున్న ప్రతిఫలమూ ఎక్కువ. దానికితోడు.. అత్యద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళిక వీరి సొంతం. ఇవేవీ పాటించకుండా పైకొచ్చిన వాళ్లలోనూ వారికి తెలియకుండా ఇవే గుణాలు ఉంటాయి. అందుకే, ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఇరవై శాతం మందే భాగ్యవంతులు ఉంటారని సూత్రీకరించాడు ఇటలీకి చెందిన ఆర్థికవేత్త విల్‌ఫ్రెడ్ పెరాటో. దీనికి ఆయన పెట్టిన పేరు 'పెరాటో ఫార్ములా 20=80'. ఈ సూత్రాన్నే 'కృషితో నాస్తి దుర్భిక్షం' అని భారతీయ కోణంలో బోధించారు మన పెద్దలు. ఇవన్నీ మనకు ఏం చెబుతాయంటే.. ఒక సంస్థ సంపదను సృష్టించాలన్నా, ఒక కుటుంబం ఆర్థిక విజయం సాధించాలన్నా.. శ్రమిస్తేనే సరిపోదు. దివ్యమైన ఆర్థిక ప్రణాళిక ఇప్పుడు అందరికీ అవసరం. ప్రతి కంపెనీ కొన్ని బైలాస్ పెట్టుకున్నట్లే ప్రతి ఇంటికి ఒక ఆర్థిక రాజ్యాంగం తయారుచేసుకోవాలి. ప్రతి కంపెనీకి ఒక ఫైనాన్షియల్ గోల్ ఉన్నట్లే.. ప్రతి ఫ్యామిలీకి ఒక ఆర్థిక లక్ష్యం ఉండాలి. ప్రతి పైసాకు లెక్కాపత్రం ఉన్నట్లే కుటుంబ సభ్యులందరి మధ్యా బ్యాలెన్స్‌షీట్ ప్రకటించాలి. "అప్పుల్ని నిర్వహించే డెట్ (ఈ్ఛఛ్ట) మేనేజ్‌మెంట్, సంక్షోభాలకు పరిష్కారాలను కనిపెట్టే క్రైసిస్ మేనేజ్‌మెంట్, అత్యవసరాలకు ఆదుకునే ఎమర్జెన్సీఫండ్ వంటి పద్ధతుల్ని అనుసరిస్తేనే.. ఏ కుటుంబానికైనా బ్రేక్ ఈవెన్ వస్తుంది..అంటున్నారు ఆర్థిక నిపుణులు.

మీకొక ఆర్థిక రాజ్యాంగం..
ప్రతి కంపెనీకీ సొంత రాజ్యాంగం ఉంటుంది. వాటినే బైలాస్ అని పిలుస్తారు. భాగస్వాములు, ఉద్యోగులు ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే.. చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. ఆర్థిక విషయాలలో ప్రతి కుటుంబం కూడా ఆర్థిక రాజ్యాంగం రూపొందించుకోవాలి. 'మన ఆర్థిక విధానం ఇదీ' అని కుటుంబ సభ్యులందరికీ తెలియాలి. ఆ నిబంధనలు ఇలా ఉండాలి. 1.వారసత్వపు ఆస్తుల్ని విలాసాలకు ఖర్చు చెయ్యకూడదు. ఆ హక్కు ఎవ్వరికీ లేదు. 2.ఎవరి స్వేచ్ఛకూ భంగం వాటిల్లకుండా ఒక్కరి చేతుల మీదుగా ఆర్థిక బాధ్యతల్ని నిర్వర్తించాలి. 3. ఒకరికి తెలియకుండా మరొకరు అప్పులు చేసే ప్రసక్తే ఉండకూడదు. 4. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక నిజాయితీని విస్మరించకూడదు. 5. కుటుంబం మొత్తానికి ఒక బలమైన ఆర్థిక లక్ష్యం ఉండాలి.

ఆ లక్ష్యంలో అందరూ భాగస్వాములు కావాలి. 6. నెత్తిమీదికి వచ్చేవరకు ఆర్థిక రహస్యాల్ని దాచిపెట్టకూడదు. 7. రూపాయి ఖర్చు పెట్టినా లెక్క చెప్పడం ఒక స్వభావం కావాలి. 8. మొత్తం సంపాదనలో కనీసం పది శాతం పొదుపు చేయాలి. 9. సంపాదన ఆశకు ఫలితం కాదు. నైపుణ్యాలకు ప్రతిఫలం అని విశ్వసించాలి. 10. ప్రతి నెలా క్యాష్‌బుక్ రాయడం మరిచిపోకూడదు. "ఈ నిబంధనల్ని కుటుంబ సభ్యులు పాటిస్తే.. వారికి తెలియకుండానే చక్కటి ఆర్థిక ప్రణాళిక అలవడుతుంది..'' అంటున్నారు ప్రముఖ ఆర్థిక సలహాదారులు వంగా రాజేంద్రప్రసాద్. ఆర్థిక రాజ్యాంగం వినడానికి మామూలుగానే అనిపించవచ్చు. కాని, దీన్ని పాటించిన కుటుంబాలన్నీ అసాధారణ వ్యాపార సామ్రాజ్యాల్ని సృష్టించాయి. అలాంటి సంస్థల్లో టాటా, బిర్లా, జిందాల్ సంస్థలు కూడా ఉన్నాయంటే నమ్మండి.

ఆర్థిక లక్ష్యం
ఇల్లు కట్టాలి. కారు కొనుక్కోవాలి. పిల్లలకు చదువులు చెప్పించాలి. ఘనంగా పెళ్లిళ్లు చేయాలి. ఇవన్నీ ఆర్థిక లక్ష్యాలు. ఆరోజుకారోజు అనుకుంటే అయ్యే పనులు కావు. ప్రతి కుటుంబానికి ఇందులో ఎన్నో కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం కోరికలు అనుకుంటాం. కాని వాటిని ఆర్థిక లక్ష్యాలుగా అనుకున్నప్పుడే పక్కాగా ఏదైనా సాధించగలుగుతాం. ప్రణాళిక లేకపోతే వీటిని చేరుకోవడం సాధ్యం కాదు. ఆ లక్ష్యం కోసం ఎంత సంపాదించాలో అంచనా వేసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు మీరొక కారు కొనుక్కోవాలనుకున్నారు. ప్రస్తుతం ఆ కారు ధర అయిదు లక్షలు. ఆర్థికపరిభాషలో దీన్ని 'టైమ్ వాల్యూ ఆఫ్ మనీ' అని పిలవాలి. మరో నాలుగేళ్లకు కారు తీసుకోవాలంటే అప్పటి ధర ఎనిమిది లక్షలు ఉండొచ్చు. దాన్ని 'ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ' అంటారు. అంటే- నాలుగేళ్ల లక్ష్యం ఎనిమిది లక్షలన్నమాట. అమ్మాయికి పెళ్లి చేయాలన్నది లక్ష్యం అయితే, ఇదే సూత్రంతో ఖర్చును లెక్కవెయ్యాలి.

ఇప్పుడు పెళ్లి చేస్తే పది లక్షలు కావచ్చు. అదే పెళ్లి మరో పదేళ్లలో చేస్తే ఇరవై లక్షలు కాకతప్పదు. ఆర్థిక లక్ష్యాన్ని ఈ పద్ధతిలోనే అంచనా వేయడం మంచిది. చాలామంది ఈ రోజు ధరల్ని బట్టి భవిష్యత్తు లక్ష్యాలకు అయ్యే ఖర్చును అంచనా వేస్తారు. అందువల్ల చివరికి అప్పులే మిగులుతాయి. "అదే ఒక సంస్థకు ఒక ఆర్థిక లక్ష్యం ఉందనుకోండి. దాన్ని చేరుకోవడానికి ఇప్పుడున్న అప్పులు, వస్తున్న లాభాలు, అవుతున్న ఖర్చులు, భవిష్యత్తులో పెరిగే ద్రవ్యోల్బణం, బ్యాంకుల వడ్డీ రేట్లు, ఆదాయ పన్నులు.. వీటన్నిటినీ లెక్కకడతాయి. కుటుంబం కూడా ఆర్థిక లక్ష్యం పెట్టుకునే ముందు- వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే ఆర్థిక లక్ష్యం విలువను కచ్చితంగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాతే ఏ మార్గంలో ఎంత మొత్తాన్ని దాచుకోవాలో నిర్ణయించుకోవచ్చు..'' అంటున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవీరెడ్డి. లక్ష్యం స్పష్టంగా లేకపోతే గమ్యం చేరలేము. ఇల్లు కొనాలనుకుని దాచుకున్న సొమ్ముతో కారు కొంటే వచ్చే సంతృప్తి తక్కువ. అదే ఇల్లు కొన్నాక కారు తీసుకుంటే వచ్చే సంతృప్తి ఎక్కువని పలు ఆర్థిక సర్వేలు చెబుతున్నాయి.

ఫ్యామిలీ బ్యాలెన్స్ షీట్..
ప్రతి కంపెనీ మూడు మాసాలకు ఒకసారి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తుంది. లాభనష్టాలు, అప్పులు, నిర్వహణ ఖర్చులు.. అన్నీ ఉంటాయి అందులో. అదే కుటుంబాన్ని తీసుకోండి. ఎంత జీతమొస్తున్నదో, ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత మిగులుతున్నదో.. చెప్పమంటే తెల్లమొఖం వేస్తాం. కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. మనలాగే కంపెనీలుంటే ఎప్పుడో దివాళా తీసేవి. ఒకప్పుడు కిరాణాకొట్టుకు వెళితే.. పట్టీ రాసుకుని వెళ్లేవారు. అందులో రాసుకున్నవి తప్ప మరొక్క వస్తువును కూడా అదనంగా తీసుకొచ్చేవారు కాదు. ఇప్పుడు ఆ పద్ధతిని మరిచిపోయాం. ఏది అవసరమో దాన్ని కొనకుండా.. కంటికి కనిపించిన దాన్నల్లా కొనుక్కురావడం వ్యసనంగా మారిపోయింది. అం దుకే, వెయ్యి రూపాయలు అనుకున్న సూపర్‌మార్కెట్ బిల్లు పదిహేను వందలవుతుంది. ఇక, కూరగాయలు, పెట్రోలు, కరెంటు బిల్లు, పాల బిల్లు.. వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో చాలా కుటుంబాలకు తెలియను కూడా తెలియదు. అది తెలిసినప్పుడే వృథా ఎంతవుతుందో కనుక్కోవచ్చు. ఈ వృథాను ఆపేందుకే ప్రతి కంపెనీ అకౌంట్స్‌కు అంత ప్రాధాన్యం ఇస్తుంది. వృథాను అరికట్టేందుకు మార్గాలను అన్వేషిస్తుంది. ఉన్న వనరులను మరింత పటిష్టంగా ఎలా వాడుకోవాలో ఆలోచిస్తుంది. ప్రతి కుటుంబం నెలనెలా క్యాష్‌బుక్ రాస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రతి నెలా ఇలా చేస్తూనే ఏడాదికి ఒకసారి బ్యాలెన్స్‌షీట్‌ను ప్రకటించాలి.

అప్పుడే- ఎవరి ఖర్చు ఎంత? ఏ ఖర్చును ఎంత తగ్గించవచ్చు? ఎంత శాతం పొదుపుకు వెళుతోంది? ఆర్థిక లక్ష్యాల్ని చేరడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇవన్నీ కుటుంబ సభ్యులందరికీ అర్థం అవుతాయి. దీనివల్ల "ఇంట్లో ఆర్థిక ప్రజాస్వామ్యం పెరుగుతుంది. ఒకర్నొకరు ప్రశ్నించుకుంటారు. కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక స్వభావాల్లోనూ ఊహించని మార్పులొస్తాయి. ఇంటిల్లిపాదీ తెలుసుకునే ఈ ఆర్థిక జ్ఞానం ఎన్ని ఆర్థిక శాస్త్రాల్ని చదివినా రాదు..'' అంటాడు ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. బ్యాలెన్స్‌షీట్ చేసే మరో గొప్ప ఉపకారం- పిల్లల్ని రేపటి జీవన పోరాటానికి సన్నద్ధం చేయడం. బాల్యం నుంచే పిల్లలకు కుటుంబ ఆదాయం, వ్యయం, ఖర్చులు తెలిస్తే.. వాళ్ల కోరికలు సైతం ఆ పరిధిలోనే ఉంటాయి. బ్యాలెన్స్‌షీట్ గొప్పదనాన్ని ఆ రోజుల్లోనే వ్యక్తికి అన్వయిస్తూ చెప్పాడు కౌటిల్యుడు. "ప్రతి వ్యక్తీ, ప్రతి రోజూ నేను ఎవర్ని? నా సంస్కృతి ఏమిటి? నా ఆదాయ వ్యయాలెంత? అని తర్కించుకోవాలి'' అని అర్థశాస్త్రంలో రాశాడు. వర్తక కుటుంబాలైన వైశ్యులు, మార్వాడీలు, కాబూలీలు, గుజరాతీలను పరిశీలిస్తే, ఈ బ్యాలెన్స్‌షీట్ పద్ధతి ఇప్పటికీ కనిపిస్తుంది.

డెట్ మేనేజ్‌మెంట్...
ప్రతి కంపెనీకి అప్పుల్ని నిర్వహించడం ఒక సవాలు. ఒక వైపు కంపెనీ ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. మరోవైపు వడ్డీలు మీద పడుతుంటాయి. కొత్త అప్పులివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. వీటన్నిటినీ అధిగమిస్తూ.. కంపెనీని సవ్యంగా నడిపించాలి. కుటుంబ స్థాయిలో తీసుకుంటే, ఇక్కడ కూడా అవే అప్పులు, అవే వడ్డీలు, అవే ఇబ్బందులు కనిపిస్తాయి. జీతమెంత వచ్చినా నిలబడదు. సంపాదన ఎంత వచ్చినా సరిపోదు. మళ్లీ అప్పులు. ఎందుకు చేయాల్సి వస్తుందో తెలియదు. వాటిని ఎలా తీర్చుకోవాలో అర్థం కాదు. "అప్పులు రెండు రకాలు. 1. మంచి అప్పులు. 2. చెడ్డ అప్పులు. మొదటి అప్పు సంపదను పెంచుతుంది. రెండోది ఉన్న ఆస్తుల్ని మింగేస్తుంది..'' అంటారు డెట్ మేనేజ్‌మెంట్ నిపుణులు. ఒక వ్యక్తి అప్పు చేసి స్థలం కొంటాడు. మరో వ్యక్తి అప్పు చేసి కారు కొంటాడు. ఈ ఇద్దరిలో ఒకరిది పెరిగే ఆస్తి. మరొకరిది తరిగిపోయే ఆస్తి. అందుకే, కంపెనీలు అప్పుల నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాయి. ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయ హంగులకు కాకుండా.. శాశ్వత నిర్మాణాలకో, మరో కంపెనీ టేకోవర్‌కో అప్పుల్ని చేస్తాయి.

దీనివల్ల సంస్థ ఆస్తుల విలువ పెరుగుతుంది. ఈ పద్ధతిని కుటుంబాలు కూడా పాటించవచ్చు. కాని, ఆర్థిక సామర్థ్యానికి మించి అప్పులు చేస్తే అసలుకే ప్రమాదం. అప్పు చేసేముందు- కుటుంబ ఆర్థిక బలాలు- బలహీనతలు పరిశీలించాలి. భవిష్యత్తులో పెరిగే ఆదాయం, చెల్లించే వడ్డీలను తెలుసుకోవాలి. అప్పుడే ఎంత మొత్తంలో అప్పు తీసుకోవచ్చో అర్థమవుతుంది. కంపెనీల డెట్ మేనేజ్‌మెంట్‌లో మరో ప్రధానమైన అంశం: ఎన్ని సంక్షోభాలు ఎదురైనా రుణదాతలతో సంబంధాలను తెంచుకోకపోవడం. చిన్నాచితక కంపెనీలు తప్పిస్తే, మిగిలిన కంపెనీలన్నీ ఈ పద్ధతిని పాటిస్తాయి. కాని, మితిమీరి అప్పులు చేసిన కుటుంబాలు మొదట చేసే పని, రుణదాతలతో సంబంధాల్ని తెంచుకోవడం. 'అప్పుల నిర్వహణలో ఇదే అతి పెద్ద తప్పు' అంటున్నారు ఆర్థిక నిపుణులు. అప్పులకంటే ప్రమాదకరమైనది షూరిటీలు ఇవ్వడం. హామీ సంతకం పెట్టకపోతే రిలేషన్స్ పోతాయనుకుంటారు. నిజానికి హామీ ఇచ్చినా రిలేషన్స్ ఉంటాయన్న గ్యారెంటీ లేదు. అప్పులపాలు చేసే మరొక సమస్య- ఆర్థిక బలహీనులకు అధిక వడ్డీలకు అప్పులివ్వడం. వారు తిరిగి ఇవ్వకపోవడానికితోడు మనోవేదనకు గురికావాల్సి వస్తుంది. అదనపు సంపాదన...
ఒకరి సంపాదనతో బతికే కాలం కాదిది. కుటుంబాలేం ఖర్మ. పెద్ద పెద్ద సంస్థలు కూడా ఆ విషయాన్ని ఎప్పుడో గ్రహించాయి. మీరెప్పుడైనా పోస్టాఫీసుకు వెళ్లి చూడండి. ఉత్తరాలు బట్వాడా చేసే ఆ సంస్థ బంగారు నాణేలను అమ్ముతుంటుంది. అంటే దాని వల్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోందన్న మాట. సరుకుల్ని అమ్మాల్సిన సూపర్‌మార్కెట్లు బజ్జీలు, పానీపూరి, కేకులు కూడా విక్రయిస్తుంటాయి. ప్రయాణికుల్ని తీసుకెళ్లే ప్రైవేటు బస్సులు.. బియ్యం బస్తాల్ని, పప్పుల్ని తీసుకెళుతుంటాయి. పగలు నడిచే ప్రైవేటు పాఠశాలలు రాత్రి మరో వ్యాపారానికి అద్దెకిస్తున్నాయి. ఇవన్నీ అదనపు ఆదాయాన్ని తెచ్చిపేట్టేవే. కుటుంబ సభ్యుల్లో చేతనైన శక్తి ఉన్నవారు ఏదో ఒక చిన్న పని చేయవచ్చు. కుటుంబానికి అది ఎంతో ఆసరాగా నిలుస్తుంది. నెలకు రెండు మూడు వేలు కూడా అదనపు ఆర్థిక శక్తిని ఇస్తుంది. కోట్ల రూపాయల లావాదేవీలున్న పెద్ద పెద్ద కంపెనీలే ఈ సూత్రం పాటిస్తున్నప్పుడు.. మనం పాటించడంలో తప్పు లేదు.

వ్యాపార వ్యూహం లేకుండా ఏ కంపెనీ విజయం సాధించలేదు. పోటీదారుల్ని, మార్కెట్ తీరుతెన్నుల్ని అది ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. అందుకోసం ప్రత్యేక వ్యూహకర్తలు ఉంటారు. దెబ్బతిన్న కంపెనీలను టేకోవర్ చేసి కలుపుకోవడం, పైకొస్తున్న మరో సంస్థలో పెట్టుబడులు పెట్టించడం వీరి పని. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఇలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు అవసరం అంటున్నారు నిపుణులు. రియల్ఎస్టేట్ మందగించినప్పుడు, స్టాక్‌మార్కెట్ పడిపోయినప్పుడు, బంగారం ధర తగ్గినప్పుడు.. పెట్టుబడులు పెడితే మెరుగైన లాభాలొస్తాయి. ఈ ఎత్తుగడలు వేయాలంటే ఆర్థిక సాహిత్యంపై అవగాహన అవసరం.
సంస్థలు అనుసరించే ప్రణాళికల్లో ఆఖరుది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్). లాభాల్ని సమాజం అందించింది కనుక.. తిరిగి ఎంతోకొంత ఆ సమాజ సంక్షేమానికే ఖర్చు పెట్టడం దాని ఉద్దేశ్యం. ఇదే సూత్రం కుటుంబానికి వర్తిస్తుంది. ఉత్తమ ఆర్థిక ప్రణాళికతో బ్రేక్ ఈవెన్ సాధించాక.. ఎంతోకొంత సామాజిక సేవ చేయాలి. అప్పుడే ధర్మ అర్థ కామ మోక్షం లభిస్తుంది.

నిగ్రహానికి పరీక్ష 'డబ్బు'
డబ్బును మనం తాత్వికదృక్పథంతోనే అర్థం చేసుకోవాలి. సాంకేతికంగా అర్థం చేసుకుంటే, అది మనల్ని తినేస్తుంది. డబ్బును నియంత్రిస్తే మనిషి ధనవంతుడు అవుతాడు. అదే డబ్బు మనిషిని నియంత్రిస్తే దరిద్రుడు అవుతాడు. అందుకే, కుటుంబ విలువల్ని, అనుబంధాల్ని ఖర్చు చేసి సంపాదించే డబ్బు డబ్బే కాదు. మనిషి నిగ్రహానికి డబ్బు ఎప్పుడూ పరీక్ష పెడుతుంటుంది. వారెన్‌బఫెట్, ఝన్‌ఝన్‌వాలా షేర్‌మార్కెట్‌లో కోట్లు సంపాదించారని.. అందరూ ఎగబడి షేర్లు కొంటుంటారు. కంపెనీల ఆర్థికస్థితిగతులేవీ వీరికి పట్టవు. అవగాహనే ఉండదు. అందుకే, తొంభై శాతం మందికి నష్టాలొస్తాయి. దీన్నే జ్ఞానం లేని ఆశ అంటాం. ఈ పరీక్షల్ని తట్టుకోవాలంటే.. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం. పెద్దలు అనుసరిస్తే, పిల్లలకు అలవడుతుంది. పార్శీ కుటుంబాల్లో పిల్లలు పుట్టిన వెంటనే వారికి టాటాస్టీల్ షేర్లను కొనివ్వడం ఆనవాయితీ. ఆ పద్ధతి ఇప్పటికీ ఉంది. మార్వాడీల్లో పదిశాతం పొదుపు చేయడం ధర్మంగా భావిస్తారు. వాళ్ల సంస్కృతిలో దాన్నొక భాగం చేసుకున్నారు. కుటుంబ వ్యాపార వర్గాలన్నీ ఆర్థిక క్రమశిక్షణతో పైకొచ్చాయి.
- సిఎల్ఎన్ మూర్తి, సిఇఓ,
రాడిక్స్ అండ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్
clnm@radiffmail.com


ఆర్థిక వైద్యంఅవసరం
కోటీశ్వరునిగా బతకాలనుకుంటున్నారా? సంతోషంగా జీవించాలనుకుంటున్నారా? అని ఏ మనిషినైనా అడగండి. అందరూ చెప్పేది ఒక్కటే! సంతోషంగా జీవిస్తే చాలని. అలా బతకాలన్నా మళ్లీ డబ్బు దగ్గరికే రావాలి. ఈ రెండింటికీ ఉన్న వ్యత్యాసం సున్నితమైనది. అందుకే, డబ్బు సంపాదనకు పోరాట యోధుడు అవ్వాల్సిందే! అయితే, ఆ ఫలితాన్ని (డబ్బును) మనసుకు అంటుకోకుండా చూసుకోవాలి. సంపదను సృష్టించిన వాళ్లంతా డబ్బు కోసం కష్టపడలేదు. పని కోసం కష్టపడ్డారు. అందులో సంతృప్తి కోసం శ్రమించారు. డబ్బును సంపాదించాలనుకునేవారంతా ఈ మార్గాన్ని ఎంచుకోవడం అత్యుత్తమం.

దాన్ని కొనసాగిస్తూనే.. ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను అనుసరించాలి. ఈ రోజుల్లో మదుపు చేయడం ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఒకప్పుడు ఇన్ని మార్గాలు ఉండేవి కావు. అందుకే, ఆర్థిక సలహాదారులు కావాల్సి వచ్చారు. మనకు జబ్బుచేస్తే డాక్టర్ దగ్గరికెళ్లి వైద్య పరీక్షలన్నీ చేయించుకుని, మందుల్ని వాడుతున్నాం. ఆర్థిక కష్టాలు పట్టిపీడిస్తున్నా.. వెల్త్ డాక్టర్ (ఆర్థిక సలహాదారు) దగ్గరికి వెళ్లి ఆర్థిక వైద్యం చేయించుకోం. ఇప్పుడు ఆ వైద్యం అందరికీ అవసరం. ఒక కుటుంబం సంపాదన, ఆర్థిక లక్ష్యం, అప్పులు, ఖర్చులు, పొదుపు.. అన్నీ పరిశీలించి చక్కటి సలహా ఇస్తాడు. దాన్ని పాటిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేని కుటుంబాలు ఎప్పటికైనా చిక్కుల్లో పడతాయి. కష్టాల్లోనే కరిగిపోతాయి.

- వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక సలహాదారులు
rajendra_vanga@Yahoo.co.in


ఎవరు ధనవంతుడు?
ఇరవై వేల జీతగాడు ఇరవైరెండు వేలు ఖర్చు చేస్తే పేదవాడు.
అయిదు వేల జీతగాడు 4,500 ఖర్చు చేసి, అయిదొందలు దాచుకుంటే ధనవంతుడు.

ఏది ఆర్థిక విజయం?
నెలకు పదివేలు సంపాదిస్తున్నారనుకోండి. మీరు పొదుపు చేసిన మొత్తం మీద ప్రతి నెలా మరో పదివేల ఆదాయం వస్తే అదే ఆర్థిక విజయం. ఎవరి సంపాదనకు వారు దీన్ని అన్వయించుకుంటే.. ఆ విజయానికి వాళ్లెంత దూరంలో ఉన్నారో తెలుస్తుంది.

డబ్బుకు ఎవరంటే చేదు?
డబ్బుకు రెండు కళలు తెలుసు. ఒకటి : సంపాదిస్తే దగ్గరికి రావడం. రెండు : ఖర్చు పెడితే దూరమవ్వడం. రెండో దాని వ్యామోహంలో పడిన వారినెప్పుడూ డబ్బు ఇష్టపడదు. ఎంత త్వరగా అంటే అంత త్వరగా వదిలి పారిపోతుంది.

మీకు అత్యవసర నిధి ఉన్నదా?
అప్పుల్లో పడుతున్న వాళ్లలో నూటికి అరవై శాతం మంది ఎమర్జెన్సీఫండ్ లేని వాళ్లేనని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి కంపెనీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ పెట్టుకున్నట్లే.. మీరు కూడా ప్రతినెలా ఎంతో కొంత మొత్తంతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. లేదంటే.. ఏ రోజైనా అప్పులు మీ తలుపు తట్టవచ్చు.


మీ కుటుంబ వ్యవహారాలన్నిటినీ మీరే చూస్తుంటారా..? ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్నీ మీపైనే వేసుకున్నారా..? మీ ఆర్థిక లావాదేవీల గురించి మీ భార్యకు అస్సలు తెలియదా...? అలా అయితే చాలా తప్పు చేస్తున్నట్లే లెక్క అంటున్నారు ఆర్థిక సలహాదారులు.

మీరు చాలాచోట్ల పెట్టుబడులు పెట్టి ఉంటారు. అలాగే కొందరికి అప్పుగా డబ్బు ఇచ్చి ఉండవచ్చు. పలుచోట్ల స్థిరాస్తులను కొనుగోలు చేసి ఉండవచ్చు. ఈ వివరాలన్నింటినీ మీ భాగస్వామికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోవడం వల్ల మీ కుటుంబానికి తెలియకుండానే నష్టం జరుగుతుంది. ఆమెకు చెప్పినా అర్థం కాదులే..? అని వదిలేయవద్దు. దీనికంటూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి అన్ని విషయాలను ఆమెకు చెప్పండి.

మీ పెట్టుబడుల జాబితా-
అసలు మీకు ఎక్కడెక్కడ పెట్టుబడులు ఉన్నాయో ఓ జాబితా తయారు చేయండి. ఆ వివరాలను ఆమెకు పూసగుచ్చినట్లు చెప్పండి. ఒకవేళ చెప్పకూడని ఆస్తి వివరాలేమైనా ఉంటే వాటిని ప్రత్యేకించి మీ డైరీలో రాసి ఉంచండి.

ఎప్పుడైనా మీరు సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆస్తి సంబంధిత సమస్యలేమైనా తలెత్తితే, మీ భాగస్వామికి వాటి పూర్వాపరాలు తెలుసు కనుక వాటిని ఆమే పరిష్కరించగలదు. సుదూర ప్రాంతంలో ఉన్న మీరు సదరు సమస్యపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఒకవేళ మీ పర్సనల్ కంప్యూటర్‌లో ఆ వివరాలను నిక్షిప్తం చేసి ఉన్నట్లయితే, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఆమెకు తెలియజేయండి. ఇది ఎంతో గోప్యమైనదని మీ భాగస్వామితో విడమరిచి చెప్పండి.

మీ బ్యాంకు ఖాతా వివరాలు-

మీ బ్యాంకు ఎకౌంటు వివరాలను మీ భార్యకు ఎప్పటికప్పుడు చెపుతూ ఉండండి. ముఖ్యంగా ఇది ఎమర్జెన్సీ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనుకోకుండా ప్రమాదాల బారినపడినప్పుడు, మీరు అందుబాటులో లేనప్పుడు మీ భార్య వ్యవహారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది.

అంతేకాదు... బ్యాంకు బ్యాలెన్సును బట్టి ఆమె తన ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకునే అవకాశం కలుగుతుంది. మీ ఎకౌంటులో నగదు ఎంత ఉందో తెలియని స్థితిలో ఆమెను ఉంచకూడదు.

తనఖాలు.. క్రెడిట్ కార్డ్ అప్పులు-

మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్లు, తనఖా, క్రెడిట్ కార్డ్ అప్పులు.. ఇతర అప్పుల వివరాలన్నిటినీ ఆమెకు తెలియజేయండి. మీరు మీ పనులతో బిజీగా ఉంటారు కనుక, మీ భార్య తీరిక వేళల్లో మార్కెట్ ఎగుడుదిగుడులను గమనించి మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయో లేదో చూసి బేరీజు వేయగలదు. అదేవిధంగా పేరుకుపోతున్న అప్పుల నుంచి ఎలా బయటపడాలో ఆమె ఆలోచన చేసి మీకు మంచి పరిష్కార మార్గాన్ని చూపగలదు.

బరువంతా ఆమెపైనే వేయకూడదు-

అన్నీ చెప్పేశాను కదా... ఇక అన్నీ ఆమే చూసుకుంటుందిలే.. అని ఆమెపై అధిక భారం మోపకూడదు. ఆర్థిక లావాదేవీలను ఆమె ఎలా పరిష్కరిస్తుందో అప్పుడప్పుడు చూస్తుండాలి. మీకు బాగా ప్రయోజనాన్ని చేకూర్చేవిధంగా ఆమె నిర్ణయం తీసుకుని ఉంటే... ఆమెను అభినందించండి. ఒకవేళ నష్టానికి దారితీసే నిర్ణయమైతే.. ఎందుకు నష్టం వచ్చిందో వివరించి చెప్పండి. అంతేగానీ.. తిట్ల దండకంతో ఆమె మనసును గాయపరచకూడదు. ఇలా చేస్తే ఆమెపై ఆమెకున్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది.

కొనుగోళ్లలో ఆమెను పాలుపంచుకోనివ్వండి-

కొన్ని ఆర్థిక లావాదేవీలలో స్వయంగా పాల్గొనే అవకాశాన్నివ్వండి. ఉదాహరణకు.. మీరు ఒకచోట భూమి కొనదలచారునుకోండి. ఆ కొనుగోలు వ్యవహారంలో మీతోపాటు మీ భార్యను మాట్లాడనివ్వండి. అలాగే మీ ఆర్థిక వ్యవహారాల్లో వేటికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ చెప్పండి. ఇది తెలుసుకుని ఉన్నట్లయితే ఆమె ఎక్కడా పొరపాటు నిర్ణయం తీసుకునే వీలే ఉండదు.

ఇంటి బడ్జెట్- ఇల్లాలిదే నిర్ణయం-

అన్నిటికీ మించి మీ ఇంటి బడ్జెట్‌పై ఆమె కసరత్తు చేసిన అనంతరం, ఆ అంశాలను మీరు పరీక్షించండి. వాటిలో ప్రాధాన్యం లేనివాటిని తొలగించి.. కారణాలను మీ భాగస్వామికి తెలుపండి.

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని మసలుకుంటే పురుషులు తమపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడమేకాక, వారి భాగస్వాములు ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి అజ్ఞానంలో లేకుండా చేయవచ్చు. ఫలితంగా ఇంటి ఆర్థిక స్థితి పటిష్టతకు దోహదపడుతుంది.